ఇంట్లో సిసి కెమెరాలు.. నెట్ లో సీన్స్ చూసి షాక్ అయిన కపుల్స్

ప్రస్తుత రోజుల్లో కొందరు యువకులు చేస్తున్న పనులు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. టెక్నాలిజీ పెరిగిపోవడంతో కొందరు దానిని అవసరానికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు తప్పుడు దారుల్లో ఉపయోగిస్తున్నారు. రీసెంట్ గా బెంగుళూరు లో ఒక యువకుడు చేసిన దారుణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరం కోరమంగలలో ఇద్దరు భార్య భర్తలు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే వారికి తెలిసిన మిత్రుడి ద్వారా బెడ్ రూమ్ దృశ్యాలు నెట్ లో ఉన్నాయని తెలుసుకున్న భర్త పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఇన్వెస్టిగేషన్ చేయగా ఇంటి ఓనర్ కొడుకు అంజన్ అసలైన నిందితుడని తెలుసుకున్నారు. వారు ఇంట్లో లేనప్పుడు డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి ప్రవేశించి రహస్యంగా చిన్న సిసి కెమెరాలను అమర్చాడు. ఆ విధంగా రికార్డ్ అయినా దృశ్యాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడని పోలీసులు గుర్తించారు. అయితే విషయం పోలీసుల వరకు వెళ్లడంతో అంజన్ పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Comments