ఎంపీలు, ఎమ్మెల్యే లకు షాక్..భార్యలకు కూడా ఓ లెక్క ఉంటుంది..!


ప్రజా ప్రతినిధులకు షాక్ ఇచ్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వారి పేరున ఉన్న వ్యక్తి గత ఆస్తులని వివరిస్తే సరిపోతుంది. దీనితో వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘం తెలుసుకునేందుకు వీలు లేకుండా పోతోంది. కోట్లల్లో వారి కుటుంబ సభ్యుల పేరున ఆస్తులను కూడబెట్టుకున్న ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఆస్తులు కేవలం లక్షలు, వేలు మాత్రమీ అంటూ దొంగ లెక్కలు చూపించడం చూస్తూనే ఉన్నాం. ఈ విషయం అందరికి తెలిసినదే అయినా నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో కొంతలో కొంత అయినా రూల్స్ లో మార్పు చేస్తే మంచిందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో అభ్యర్థుల ఆస్తుల వివరాలతో పాటు వారి జీవిత భాగస్వామి ఆస్తులని కూడా బయట పెట్టేలా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ఈ ప్రతిపాదనని సుప్రీం కోర్టు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ధర్మాసనం ఈ ప్రతిపాదనకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఈ ప్రతిపాదనని, కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా ఉంచింది. వారు కూడా దీనిపై వర్కవుట్ ప్రారంభించారు. ఈ రూల్ అమలులోకి వస్తే రాజకీయ నేతల వ్యతిగత ఆస్తులతోపాటు వారి భార్యల ఆస్తులు కూడా బయట పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి జరిపిన దర్యాప్తులో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యే ల ఆస్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన సమయం లో వారి చూపించిన లెక్కలు పచ్చి అబద్ధాలని, దానిపై దర్యాప్తు కొనసాగుతునాలు అధికారులు చెబుతున్నారు.

Comments