ప్రచురణ తేదీ : Sep 28, 2017 3:35 PM IST

కుల వివాదం.. ఎంపీ, ఎమ్మెల్యే టిడిపికి గుడ్ బై..?


ఇటీవల టీడీపీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక ఎస్సి, ఎస్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ పై మాల మహానాడు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులపై తెలుగుదేశం పార్టీ వివక్ష చూవుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులంతా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేయాలని అన్నారు. తెలుగు దేశం పార్టీలో దళితులకు అవమానం జరుగుతోంది అని చెప్పడానికి ఆయన ఉదాహరణలు కూడా వివరించారు.

తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఎంపీ శివప్రసాద్ ని తొలగించడానికి కారణం దళితుల వివక్షే అని అన్నారు. కాపు సామజిక వర్గానికి పట్టం కట్టేందుకు పీతల సుజాతని మంత్రి వర్గం నుంచి తొలగించినట్లు తెలిపారు. వీరు వెంటనే టీడీపీని వదలి బయటకు రావాలని కోరారు. ఎంపీ శివప్రసాద్ కు పార్టీ తో విభేదాలు ఉన్నాయి. ఆ మద్యన ఆయన నేరుగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఇక తనని మంత్రి పదవి నుంచి తొలగించారని పీతల సుజాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వీరిద్దరూ వచ్చే ఎన్నికల వరకు పార్టీలో కొనసాగే సూచనలు లేవని వార్తలు వస్తున్నాయి. ఆ మద్యన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ తాను పోటీ చేయడానికి చాలా పార్టీలు ఉన్నాయని అన్నారు. పొలిట్ బ్యూరో నుంచి తొలగించడంతో పార్టీ నుంచి దూరం జరిగే ఆలోచనలో శివప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.

Comments