840 ఏళ్ల క్రితం ఆ బుడతడు ఇండియాలో పుట్టాడంట…!

bhutan
పునర్జన్మలు గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎవరికి పునర్జన్మలు ఉంటాయో, ఉండవో ఖచ్చితంగా తెలీదు. ఈ పునర్జన్మల మీద వెండితెరపై చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కూడా చాలావరకు విజయవంతం అయ్యాయి. దీనినిబట్టే జనాలకు పునర్జన్మలపై ఎంత ఆసక్తి ఉందొ అర్ధమౌతుంది. తాజాగా నేపాల్ కు చెందిన ఒక మూడేళ్ళ బుడతడికి తన పూర్వ జన్మ స్మృతులు గుర్తుకొస్తున్నాయని చెప్తున్నాడు. ఆ బుడతడు మాములు యువకుడు కాదు. భూటాన్ దేశపు యువరాజు.

భూటాన్ మహారాజు జింగ్మే కేసర్ నంజ ల్ వాంగ్ చుక్, రాణి జట్సిన్ పీమా వాంగ్ చుక్ దంపతుల కుమారుడు హెచ్ హెచ్ విరోచిచానా రింపోచే తాను 840 సంవత్సరాల క్రితమే ఇండియాలో పుట్టానని చెప్తున్నాడు. అప్పట్లో ఒక వెలుగు వెలిగిన బీహార్లోని నలంద విశ్వ విద్యాలయంలో తాను చదువుకున్నానని కూడా చెప్తున్నాడు. రెండు రోజుల క్రితం అక్కడ పర్యటించిన సందర్భంగా ఈ యువకుడు ఆ విషయాన్నీ చెప్పాడు. అంతేకాదు శనివారం నాగార్జున తన అమ్మమ్మతో కలిసి నాగార్జున కొండను సందర్శించాడు. ఇక్కడ కూడా ఇదే విధంగా ప్రకటిస్తున్నాడు. 840 ఏళ్ల క్రితమే నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వ విద్యాలయంలో తాను అభ్యసించానని చెప్పాడు. తనకు కలలో ఐదు తలలు పాము కనిపిస్తుందని, అప్పట్లో ఆ పాము నాగార్జున కొండపై తిరిగేదని అంటున్నాడు. అంతేకాదు తాను కొండ మీద తిరిగే ప్రాంతాలను, తాను కూర్చున్న ప్రదేశాలను కూడా ఆ బుడతడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం కొండపై ఉన్నది బుద్దుడి విగ్రహం కాదని, ఇక మాతా విగ్రహమని చెప్తున్నాడు. ఆ విగ్రహం అప్పట్లో కొండపై కాకుండా నది మధ్యలో ఉండేదని అంటున్నాడు. ఆ బుడతడి అమ్మమ్మ మాట్లాడుతూ… తన మనవడు కారణజన్ముడని, అందుకే గత జన్మ స్మృతులు అతనికి తెలుస్తున్నాయని ఆమె అంటుంది.

Comments