బ్రేకింగ్ న్యూస్ : ఐఆర్‌సీటీసీ సంచలన నిర్ణయం?

రైల్వే టికెట్ బుకింగ్ సంస్థ ఐఆర్‌సీటీసీ తాజాగా థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సంస్థలకు చెక్‌ పెట్టేవిధంగా పావులు కదుపుతోంది. తద్వారా ప్రస్తుతం నెలకు 1.2మిలియన్లకు పైగా టికెట్లను విక్రయిస్తున్నసంస్థ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదాయంతోపాటు భారీ లావాదేవీల ద్వారా అధిక మొత్తంలో వచ్చే తక్షణ ఆదాయాలపై ఐఆర్‌సీటీసీ ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలోనే సొంత పేమెంట్‌ గేట్‌వేను ప్రారంభించనుంది. తద్వారా థర్ట్‌ పార్టీ పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రాథమికంగా ఈ పేమెంట్‌ గేట్‌వేకు ‘ఐపే’గా పిలుస్తోందట.

రాబోయే మరికొన్ని రోజుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనుంది. తద్వారా ప్రస్తుతం రేజర్‌, మొబీక్విక్‌‌, పేటిఎం లాంటి సంస్థకు గట్టి షాక్‌ ఇవ్వనుంది. ఈ సంస్థలకు గేట్‌వేల ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ లావాదేవీలకు భారీగా గండిపడనుంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు పేటీఎం, రేజర్‌ రెండూ నిరాకరించాయి. అటు సొంత పేమెంట్‌ గేట్‌వే ఆవిష్కరణపై ఐఆర్‌సీటీసీ కూడా అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది….

Comments