ప్రచురణ తేదీ : Apr 5, 2018 11:59 PM IST

ఫ్లాష్ న్యూస్ : రాజకీయ నేతలకు ఎలక్షన్ కమీషన్ ఊహించని షాక్!


రెండు పడవల ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిందే. అలానే రాజకీయులు కూడా రెండు చోట్ల పోటీ చేసినా అంతే ప్రమాదమని భావించి నేడు ఎలెక్షన్ కమీషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయాలనే ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని సుప్రీంకోర్టుకు ఎన్నికలకమిషన్(ఈసీ) స్పష్టం చేసింది. ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీచేసే విధానాన్ని రద్దుచేయాలని కోరుతూ బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది సీనియర్ నేతలు ఈ బహుళ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు.

అయితే ఇలా ఉప ఎన్నికల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవడం నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడటం సహా ఇంకెన్నో సమస్యలు తలెత్తుతున్నాయని, దానివల్ల దేశానికి కొంతమేర నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందన తెలపాలని కోరుతూ గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వం అలానే ఈసీకి నోటీసులు జారీచేసింది. అదే సమయంలో ఒకే అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న కారణంగా రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తోందని ఆ స్థానానికి మళ్లీ ఉప ఎన్నికలు అనివార్యమవుతున్నాయని కోర్టు పేర్కొంది. దీనికి తాజాగా ఈసీ స్పందిస్తూ ఒక నాయకుడు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే నిబంధనకు తాము మద్దతు ఇస్తామని వెల్లడించింది.

ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా 2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ గుజరాత్లోని వడోదర ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో వడోదర నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గజ్వేల్ అసెంబ్లీ నుంచి, మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన సంగతి విదితమే. అయితే ఈసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాజకీయపార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి మరి…..

Comments