హీరోయిన్ తో లవ్ లో పడ్డ ‘బ్రేవో’ ?


గత కొన్ని సంవత్సరాలుగా క్రికెటర్ లకు బాలీవుడ్ హీరోయిన్ లు మధ్య మంచి స్నేహం ఉండడం, ఆ స్నేహం ప్రేమగా మారి అలా కొందరు నటీమణులు క్రికెటర్ లను పెళ్లి చేసుకోవడం మనం చూసాము. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ జ‌ట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆటగాడు, డ్వేన్ బ్రావో, బాలీవుడ్ న‌టి, మిస్ ఇండియా న‌టాషా సూరితో ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవల వీరిద్ద‌రూ ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో కలవడం మీడియా కంట‌ప‌డింది. అలాగే బ్రావోతో దిగిన ఫోటోల‌ను న‌టాషా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది.

అయితే బ్రావోకు, న‌టాషాకు దాదాపు ప‌దేళ్ల నుంచి ప‌రిచ‌యం ఉందని, ఆ ప‌రిచ‌యంతోనే ప్ర‌స్తుతం ఐపీఎల్ కోసం ముంబై వెళ్లిన బ్రావో న‌టాషాతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడ‌ట‌. బ్రావో ఇటీవ‌ల త‌న భార్య‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌టాషాతో బ్రావో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడని పలు మీడియా సంస్థలు వార్తలు వస్తున్నాయి. అయితే న‌ట‌షా స‌న్నిహితులు మాత్రం వారిది స్నేహం మాత్ర‌మేన‌ని, ప్రేమ కాద‌ని చెబుతున్నారు….

Comments