ప్రచురణ తేదీ : Dec 28, 2016 9:30 AM IST

బాలిక పెళ్ళికి ఒప్పుకోలేదని కుటుంబ సభ్యుల సహకారంతో అత్యాచారం

girl
బాలికలు, మహిళలపై దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళా సంఘాలు, పోలీసులు, కోర్టులు ఎన్ని చెప్పినా వీళ్ళ తీరు మారడంలేదు సరికదా రోజురోజుకూ మరీ రాక్షసుల్లా తయారవుతున్నారు. గుజరాత్ లో ఒక అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదని ఆ అమ్మాయిని కుటుంబ సభ్యుల సహకారంతో కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్ళికి ఒప్పించాలనే ఒకే ఒక లక్ష్యంతో మూడువారాల పాటు అత్యాచారానికి పాల్పడ్డ దారుణమైన సంఘటన జరిగింది

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నరేష్ సోలంకి (19) అనే యువకుడు తమ కులానికే చెందిన 15 సంవత్సరాల బాలికను పెళ్లి చేసుకోవాలనికున్నాడు. అయితే దీనికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో నవంబర్ 11 న మరొక ఎనిమిది మందితో కలిసి ఆమెను అపహరించాడు. నరేష్ తన పొలంలో 8 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఒక గొయ్యి తవ్వి ఆ బాలికను అందులో ఉంచి ఆ గొయ్యి పైన చెక్కలు కప్పి ఉంచేవాడు. ఆ గొయ్యిలోనే నరేష్ ఆ బాలికపై మూడు వారాల్లో పలుమార్లు అత్యాచారం చేసాడు. ఇందుకు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించడం మరొక దారుణం. బాలిక తండ్రి పోలిసుల సహాయంతో వెతకడంతో డిసెంబర్ 4న ఆ బాలిక ఆచూకీ కనుగొన్నారు. నరేష్ తో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అరెస్ట్ అయ్యిన వారిలో నరేష్, అతని సోదరుడు, హరీష్, అతని తండ్రి జనంత భాయ్ సోలంకి, టాటా చతుర్బాయి సోలంకి తదితరులు ఉన్నారు.

Comments