ఐలయ్య మేధావి ఎలా అవుతాడంటే? అలా చేస్తాడు కాబట్టి!

గత రెండు రోజులుగా మీడియాలో వివాదంగా మారిన అంశం ఒక్కటే.. సామజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రచించిన ‘సామజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. తమని కించ పరిచేలా ఈ పుస్తకాన్ని ఐలయ్య రాశారని మండి పడుతున్న ఆర్య వైశ్యులు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఐలయ్య దిష్టి బొమ్మలని తగలబెతూ ఆందోళనలు చేస్తున్నారు. సామజిక స్మగ్లర్లు అని టైటిల్ పెట్టి ఓ కులాన్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి ? అసలు ఈ కంచె ఐలయ్య ఎవరు ? ఈ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

1952 లో పాపన్న పేటలో జన్మించిన ఐలయ్య కుటుంబం గొర్రెల పెంపకంపై ఆధార పడి జీవించే వారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఐలయ్య పొలిటికల్ సైన్సు లో డాక్టరేటు పొందారు. ఆ తరువాత అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసారు. అంబేత్కర్, మర్క్స్ సిద్ధాంతాలపై ఆయనకు బలమైన విశ్వాసం ఉంది. ప్రస్తుతం వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వివాద భరిత పుస్తకాలని రచించడం ఐలయ్యకు కొత్త కాదు. గతం లో ఆయన ‘నేనెట్లహిందువునైత’, హిందూ మతానంతర భారత దేశం, అంటరాని దేవుడు వాటి వివాదాస్పద పుస్తకాలని రచించారు. వాటి వలన అయన విమర్శలు ఎదుర్కొన్నా అవి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఐలయ్య గతం లోఅనేక కులాలపై వివాదాస్పద పుస్తకాలని రచించారు. ‘అజ్ఞాత ఇంజనీర్లు కుమ్మరి, కంసాలి, గౌండ్ల’ , సామజిక వైద్యులు – మంగలోళ్లు వంటి పుస్తకాలని రచించారు.

బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా ఈ పుస్తకాలని ఐలయ్య రచించినట్లు తెలుస్తోంది. బడుగు బలహీన వర్గాలు అణచివేతపై ఆయన పోరాటం చేస్తున్నారు. అది మంచిదే అయినా ఈ మార్గంలో చేయడం సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. సమాజం లో ఉన్న పలు కులాలని పరిశోధించిన మనసుకు తోచిన రాతల్ని పుస్తకంలో రాసేయడం ఎంతవరకు సబబు. తాను అనుకుంటున్నదే కరెక్ట్ అని భావించడం తగదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓ వర్గం సమాజంలో వెనుక బడడానికి కారణాన్ని మరో కులంపై ఎత్తి చూపడమనేది అవివేకమైన పరిశోధన. ఒక వర్గంలో అందరిని టార్గెట్ చేస్తూ స్మగ్లర్లతో పోలిస్తే వంద శాతం వివాదానికి తావిచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Comments