ప్రచురణ తేదీ : Nov 12, 2017 6:54 PM IST

కృష్ణా జిల్లాలో ఘోరం..కృష్ణా నదిలో 23మంది గల్లంతు ..!

కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. 38 పర్యాటకులతో కృష్ణా నదిలో విహరిస్తున్న బోటు బోల్తా కొట్టడంతో 23 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. 15 మందిని స్థానిక మత్స కారులు రక్షణ సిబ్బంది కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనా వారిలో 5 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది.

పెర్రీ ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు విహారయాత్రలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం కొన్ని ప్రయివేటు సంస్థలకు అనుమతినిచ్చింది.దీనితో కొన్ని సంస్థలు అక్కడికి వస్తున్న పర్యాటకులని బోటులో విహార యాత్రకు తీసుకుని వెళుతున్నాయి. కక్కుర్తితో వాటర్ స్పోర్ట్స్ సంస్థ పరిమితికి మించి పర్యాటకులని ఎక్కించుకుంది. దీనివల్లనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. కాగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న వారిలో 10 మంది ఒంగోలుకు చెందిన వారు ఉన్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపడుతున్నారు.కాగా బోటులో లైఫ్ జాకెట్లు ఉన్నవారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలిగాడు. బోటులో అందరికి లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

Comments