LKGకి రెండు లక్షలా?.. ఆస్తులమ్ముకోవాల్సిందే!

లక్ష కన్నా అక్షరం మిన్న అనే పదం అందరికి తెలిసే ఉంటుంది. కానీ అక్షరం కన్నా లక్ష మిన్న అనేలా ఇప్పటి పాటశాలలు సరికొత్త అర్దాన్ని చెబుతున్నాయి. గత కొంత కాలంగా విద్యా సంస్థలలో చాలా మార్పులు జరిగాయి. కానీ ఎంత అభివృద్ధి చెందినా కూడా వ్యాపారం అనే తరహాలోనే పాటశాలలు నడుస్తున్నాయి. నర్సరీ ఎల్కేజీ స్టేజ్ లలోనే ఫీజుల మోత మారు మ్రోగిపోతోంది. సంబంధం లేని విషయాలని ఇండెక్స్ లో చేర్చి ఫీజుల రూపంలో గట్టిగా లాగేస్తున్నారు. రీసెంట్ గా బయటపడిన ఓ స్కూల్ ఫీ స్ట్రక్చర్ ను చుస్తే.. ఎవ్వరికైనా దిమ్మ తిరగాల్సిందే.

బెంగుళూర్ లోని బిషప్ కాటన్ బాయ్స్ అనే స్కూల్ 2017-2018 ఏడాదికి గాను LKG ఫీజు మొత్తం 2 లక్షల 20 వేల రూపాయలు. నిండా 5 ఏళ్లు కూడా లేని పిల్లవాడి కోసం చెప్పే చదువుకే ఈ రేంజ్ లో వసూలు చేస్తున్నారంటే ఆ పై తరగతుల వారికీ ఏ రేంజ్ లో తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. a నుంచి w వరకు వివిధ క్యాటగిరీలలో డిస్క్రిప్షన్ ని డిజైన్ చేసి వారు వేసిన ఫీజులను చుస్తే నోటా మాట పడిపోవడం కాయం.

అడ్మిషన్ ఫి – స్పెషల్ ఫి – మెడికల్ – గేమ్స్ – రైమ్స్ – స్మార్ట్ క్లాస్ – బిల్డింగ్ ఫండ్ – స్కూల్ డైరీ – ఐడి కార్డు అని వందల నుంచి వేల వరకు 23 రకాల ఫి స్ట్రక్చర్ ని రెడీ చేశారు. స్కూల్ ఎంత బావున్నా కూడా ఈ తరహాలో ఎల్కేజీ పిల్లాడి నుంచి చదువు పేరుతో 2 లక్షల రూపాయలు లాగేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి స్కూల్స్ లలో ఉన్నతమైన వారు పిల్లలు జాయిన్ అవుతారని అందరికి తెలిసిందే. కానీ ఒక స్కూల్ ను చూసి మరికొన్ని స్కూల్స్ కూడా ఎల్కేజీకి లక్షలు వసూలు చేస్తే మధ్యతరగతి వాడు ఆస్తులమ్ముకోవాల్సిందే.

Comments