ట్రెండింగ్ న్యూస్ :ఇండియా వైపు బికినీ ఎయిర్లైన్స్ చూపు?

పలు విమానయాన సంస్థలు తమ సంస్థ విమానాల్లోనే ప్రయాణీకులు విహరించాలని పలురకాల ఆఫర్లు ప్రవేశ పెడుతుంటాయి. అయితే వియత్నాంకి చెందిన చౌకధరల విమానయాన సంస్థ ‘వియట్‌జెట్ ఎయిర్’ ఇందుకు భిన్నమని చెప్పాలి. మనం సాధారణంగా చూసే ఎటువంటి విమానయాన సంస్థలలో అయినా ఎయిర్‌హోస్టెస్‌లు డీసెంట్ లుక్ మరియు డ్రెస్సింగ్ తో తమ విధులు నిర్వహిస్తుంటారు. కానీ ‘బికినీ’ ఎయిర్‌లైన్‌గా సుపరిచితమయిన ఈ కంపెనీ విమానాల్లో పనిచేసే ఎయిర్‌హోస్టెస్‌లు ఇతర విమానయాన సంస్థల ఎయిర్‌హోస్టెస్‌లకు భిన్నంగా బికినీలు, స్విమ్ సూట్‌లు ధరించి కస్టమర్లకు సేవలు అందిస్తుండడం విశేషం.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఈ సంస్థ కార్యకలాపాలు భారత్‌లోనూ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో భారత్‌లో వియట్ జెట్ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశముంది. ఈ విమానయాన సంస్థకు అధినేత ఓ మహిళ. ఆమె పేరు ఎన్‌గుయెన్ థి ఫుయాంగ్ థావో. ఎయిర్‌హోస్టెస్‌‍ల అసాధారణ యూనిఫాం కారణంగా వియట్ జెట్ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించిన అనతికాలంలోనే విపరీతమైన ఆదరణను చూరగొంది.

ఈ కంపెనీ అధినేత ఎన్‌గుయెన్ వియత్నాంలో మొట్టమొదటి మహిళా కోటీశ్వరురాలిగా అవతరించారంటే దీనికి లభించిన ఆదరణ ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. న్యూఢిల్లీ నుంచి హోచిమిన్ నగరానికి నేరుగా విమాన సర్వీసులను నడుపుతామని కంపెనీ ప్రకటించింది. ఈ విమానాలు వారంలో నాలుగు సార్లు సేవలందిస్తాయి. ఇదిలా ఉంటే, ప్రపంచంలోని కొన్ని దేశాలు వియట్ జెట్ ఎయిర్‌ ‘బికినీ’ ఎయిర్‌హోస్టెస్‌ల కాన్సెప్ట్‌‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సంప్రదాయక దేశమైన భారత్‌లోనూ అలాంటి అనుభవమే కంపెనీకి ఎదురుకావొచ్చని పరిశీలకులు అంటున్నారు….

Comments