ప్రచురణ తేదీ : Jan 13, 2018 2:40 AM IST

ముఖమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి.. ప్రజలేనా?

బీహార్ లో ఎవరు ఊహించని విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్ పై రాళ్లు విసరడం సంచలనం సృష్టించింది. బీహార్ లో ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడం నాయకులకు కొత్తేమి కాదు. సభలు నిర్వహించేటప్పుడే స్టేజీలపైకి చెప్పులు గుడ్లు వస్తుంటాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. బీహార్‌ బక్సర్‌ జిల్లాలోని నందన్‌ ప్రాంతంలో పర్యటనకు బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ కాన్వాయ్‌ తో వచ్చారు. చాలా మంది అధికారులు కూడా ఆయనతో ఉన్నారు. అయితే ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ఒక్కసారిగా రాళ్లు కాన్వాయ్ పై పడటం అందరిని ఆందోళనకు గురి చేసింది. దీంతో సెక్యూరిటి సిబ్బంది అలాగే పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు దీంతో సీఎం కి గాయాలు కాలేదు. వెంటనే అక్కడి నుంచి ముఖ్యమంత్రిని తరలించారు. అయితే ఘటనపై స్పందించిన నితీష్.. కావాలనే ఎవరో తనపై ఈ తరహా దాడి చేశారని ప్రజలకు మాయమాటలు చెప్పి ఉసి గొలుపుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక పోలీసులు జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. కానీ ప్రతిపక్షం నేతలు మాత్రం ముఖ్యమంత్రి అసమర్థత పాలన వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు.

Comments