బ్రేకింగ్ న్యూస్ : టాలీవుడ్ కమెడియన్ కు తృటిలో తప్పిన ప్రమాదం!


ఆది సినిమాలో చేసిన ఒక పాత్రతో టాలీవుడ్ కి పరిచయమయిన హాస్యనటుడు రఘు కారుమంచి. అందులో ఆయన చేసిన పాత్ర చిన్నదైనా నటన బాగుండడంతో ఆయనకు ఆ తరువాత చాలా చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆయనకు ఆతర్వాత మంచి బ్రేక్ ఇచ్చింది అదుర్స్, ఊసరవెల్లి తదితర చిత్రాలు. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్న ఆయన బుల్లితెర షో జబర్దస్త్ లోనూ నటిస్తున్నారు. కాగా నేడు ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పినట్లు తెలుస్తోంది. ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం వర్జీనియాలో వున్న ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో కార్ అద్దాలు ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. కాగా ప్రమాదంలో రఘు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెపుతున్నారు. అయితే ప్రమాదం తాలూకు పూర్తి విషయాలు తెలియవలసివుందని, అక్కడి మీడియా వర్గాలు అంటున్నాయి…….

Comments