ప్రచురణ తేదీ : Apr 10, 2018 10:01 AM IST

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్..!

మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా సెక్షన్ 144ను విధించారు. బీహార్‌లోని ఆర్రాలో ఇవాళ ఆందోళనకారులు రైలును ఆపేశారు. దర్బంగాలో అలజడి సృష్టించారు. ఆందోళనలు నిర్వహించాలంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను బంద్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సడలించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఈనెల 2వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ బంద్ వల్ల చెలరేగిన హింసలో సుమారు 10 మంది మృతిచెందారు. అయితే ఇవాళ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బింద్, మోరీనా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లు వద్దంటూ బీహార్‌లో నిరసనకారులు ర్యాలీ తీశారు.

Comments