ఇవాంకా వెళ్లిపోవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చిన బిచ్చగాళ్లు

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్ కు వచ్చిన రెండు రోజులు నగరంలో ఎలాంటీ వాతావరణం చోటు చేసుకుందో అందరికి తెలిసిందే. మన అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ ఈ నెల 28 నుంచి 30 జరిగింది. అయితే రోడ్లను చాలా వరకు మార్చారు. ఇక రోడ్డు పక్కన బిక్షాటన చేసేవారిని అధికారులు కనిపించకుండా చూసుకున్నారు. కొందరిని అనాధ ఆశ్రమంలో మరికొందరిని జైళ్లలో ఉంచారు. అయితే తీరా ఇవాంకా వెళ్లిపోవడంతో అధికారులు వారిని విడిచిపెట్టారు. దీంతో మళ్లీ యాచకులు వారి యధావిధి జీవితంలోకి వచ్చేశారు. చర్లపల్లి – చంచల్ గూడ జైలు నుంచి యాచకులందరిని వదిలేశామని జైలు అధికారులు తెలిపారు. అయితే ముందుగా వారికి పునరావాసం కల్పిస్తామని అలాగే స్టోర్లలో పెట్రోల్ బంక్ లలో ఉద్యాగాలు కల్పిస్తామని అధికారులు చెప్పారు. కానీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వారు మళ్లీ బిక్షాటన చేస్తున్నారు.

Comments