ప్రచురణ తేదీ : Apr 16, 2018 2:25 PM IST

బ్యూటిషియన్‌ అనుమానాస్పద మృతి?

హైదరాబాద్‌లోని లింగంపల్లిలో జరిగిన ఒక మహిళా హత్య ప్రస్తుతం ఆ ప్రాంత వాసులలో కలకలం రేపుతోంది. విషయంలోకి వెళితే, బ్యూటిషియన్‌ గా పనిచేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందని జ్యోతి అనే యువతి లింగంపల్లిలోని గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తాండూరులోని అమ్మమ్మ వాళ్ళింటికి అని బయల్దేరిన జ్యోతి ధారూర్‌ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో శవమై తేలింది. అయితే యువతిని సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు రైల్వే సిబ్బంది గుర్తించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.

సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యా లేక ఆత్మహత్యా లేక ఒకవేళ రైలు నుంచి పడిపోయిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే జ్యోతి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై అత్యాచారం జరిపి, హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. జ్యోతి ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లింగంపల్లి స్టేషన్‌లోని సీసీ
ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపి కేసు నమోదుచేసుకున్న పోలీస్ లు యువతితో పాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు…..

Comments