ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

ఇండియన్స్ మూర్ఖులు.. చెత్త మనుషులు అంటున్న బాస్కెట్ బాల్ ఆటగాడు!


ప్రపంచంలో చాలా దేశాల క్రీడాకారులకి ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. జీవితంలో ఒకసారైన ఇండియా వెళ్ళాలి అనుకుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలకి, ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉండే సంప్రదాయ సంస్కృతికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. అయితే ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న బాస్కెట్ బాల్ ఆటగాడు కెవిన్ భారతీయులని తీవ్ర వాఖ్యాలతో ధూషించాడు. అసలు ఇండియన్స్ మూర్ఖులు, ఇంకా వాళ్ళు 20 ఏళ్ల వెనుక ఉన్నారు అని అన్నాడు. అలాగే భారతీయులకి తెలివితేటలు లేవు. అని తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఓ కార్యక్రమంలో భాగంగా ఇండియా వచ్చిన కెవిన్ తరిగి వెళ్ళిన తర్వాత ఇండియాలో తన అనుభవాల గురించి మాట్లాడుతూ ఇలా భారత్ మీద దూషణలు చేసాడు. అయితే అతని విమర్శలు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అవుతున్న ఇండియన్స్ నుంచి ప్రముఖుల నుంచి అతనికి విమర్శలు ఎదురవుతున్నాయి. కెవిన్ విమర్శల మీద తక్షణం క్షమాపణలు చెపాలని, ఇండియా గురించి కనీసం అవగాహన లేకుండా ఇలా మాట్లాడుతారు అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శల మీద కెవిన్ ఎం సమాధానం చెబుతాడు అనేది చూడాలి.

Comments