పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు అంటున్న స్టార్ ప్రొడ్యూసర్…!

bandla-ganesh
ఒకప్పుడు కమెడియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. కానీ 2015లో ఎన్టీఆర్ తో ‘టెంపర్’ అనే సినిమా తీసిన తరువాత ఆయన బ్యానర్ నుండి సినిమాలు ఏమీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడని, ఎందుకంటే… పవన్ కళ్యాణ్ కు అవినీతి అంటే ఏంటో తెలీదని, ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోచుకోవడం రాదని, పవన్ కు కుంభకోణాలు చేయడం రాదని, స్కీమ్ లు వేయడం రాదని, జనాలను మోసం చేయడం రాదని’ అందుకే పవన్ రాజకీయాలకు పనికి రాడని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కు తెలిసింది ఒక్కటేనని.. అది కేవలం ప్రజలకు సేవ చేయడం మాత్రమేనని గణేష్ చెప్పారు.

ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారని ప్రశ్నించగా ‘దేశంలో ఇంతమంది మగాళ్లు ఉండగా మన నాన్ననే ఎందుకు ఇష్టపడతామని’ బండ్ల గణేష్ ప్రశ్నించారు. మీరు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించారట కదా అని ప్రశ్నించగా ‘పవన్ కళ్యాణ్ కు దేవుడా సాయం చేయక్కర్లేదని, ఆయన సమస్యలను ఆయన పరిష్కరించుకోగలరని’ బండ్ల గణేష్ అన్నారు.

Comments