ప్రచురణ తేదీ : Sun, Nov 20th, 2016

పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి భేటీ !

pawan-dattatreya-meet1
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నేడు కేంద్ర కార్మిక సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు.కాగా ఆయన పవన్ తో భేటీకావడంలో ఎలాంటి రాజాకీయ అంశం లేదు. త్వరలో దత్తాత్రేయ కుమార్తె వివాహం జరగనున్న నేపథ్యంలో అయన పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడానికి కలిశారు. కాగా ప్రస్తుతం పవన్ అటు రాజకీయంతోనూ, ఇటు సినిమాలతోను బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల అనంతపురం లో బహిరంగ సభ నిర్వహించిన పవన్ రాజకీయాలకు కాస్త గ్యాప్ తీసుకుని తన తదుపరి చిత్రం కాటమరాయుడు ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. బండారుదత్తాత్రేయ పవన్ ను స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లి ఆహ్వానించారు. ప్రస్తుతం జరుగుతున్న కాటమరాయుడు షెడ్యూల్ పూర్తయిన వెంటనే పవన్ మరో బహిరంగ సభని ఉత్తరాంధ్రలో నిర్వహించే అవకాశం ఉంది.

ఫోటోల కోసం క్లిక్ చేయండి

Comments