ప్రచురణ తేదీ : Jan 24, 2017 9:42 PM IST

ప‌వ‌న్‌పై ఫైరైన‌ మంత్రి అయ్యన్న పాత్ర‌డు

ayyanna-patrudu
ఈనెల 26న‌ విశాఖ ఆర్ కే. బీచ్ లో జ‌రిగే విద్యార్ధుల మౌన నిర‌స‌న‌కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌గా నిల‌వ‌డంతో ఆ వేడి అధికార ప‌క్షాలను తాకింది. జ‌న‌సేనాని మ‌ద్ద‌తుతో య‌వ‌త‌కు మ‌రింత బ‌లం తోడైంది. ఈ నేప‌థ్యంలో ఆరోజు రాష్ట్రంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌ని ప్ర‌భుత్వంలో అల‌జ‌డి మొద‌లైంది. శాంతియుతంగా ప్రారంభించిన జ‌ల్లిక‌ట్టు దీక్ష‌లా తీవ్ర రూపం దాల్చుతుందేమోన‌ని పార్టీ శ్రేణుల్లో గుబులు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో మంత్రి అయ్యన్న పాత్ర‌డు ప‌వ‌న్ పై నిప్పులు చెరిగారు.

హోదా కావాలంటే కేంద్రంతో మాట్లాడి ఒప్పించాలి గానీ.. ఇలా రొడ్డెక్కి నిర‌స‌న‌లు తెలియ‌జేస్తే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. ఇలాంటి ధ‌ర్నాలు వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. త‌న వ‌ల్ల ప్ర‌ధాని గెలిచాడ‌ని చెబుతున్న ప‌వ‌న్ …ఎప్పుడైనా ప్ర‌ధానిని క‌లిసి హోదాపై మాట్లాడారా? అని రెండోసారి మ‌ళ్లీ నొక్కి ఒక్కాణించారు. ఈ వ్యాఖ్య‌ల పై ఏపీ యువ‌త ఏసీ గ‌దుల్లో కూర్చుని క‌బుర్లు చెబితే పేదోడి క‌ష్టం నీకేం తెలుస్తుంద‌ని కౌంట‌ర్ వేశారు. య‌వ‌త‌కు మ‌ద్ద‌తిస్తున్న ప‌వ‌న్ గురించి మాట్లాడే హ‌క్కు నీకెవ్వ‌డిచ్చాడు? అంటూ నిప్పులు చెరిగారు.

Comments