ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఇష్టం.. కానీ : ఆస్ట్రేలియా క్రికెటర్

రీసెంట్ గా ఇండియాతో జరిగిన టీ20 లో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. అసలే వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా కనీసం టీ20 సిరీస్ ను అయినా గెలవాలని చాలా కష్టపడుతోంది. మొదటి టీ20 లో పోరాడి ఓడిన ఆసీస్ రెండవ మ్యాచ్ లో అద్భుతంగా రానించి విజయాన్ని అందుకుంది. అయితే ఇండియాపై గెలిచిందని ఎవరో ఒకరు ఆసీస్ క్రెకెటర్లు బస్సులో వెళుతుండగా రాయి విసిరారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మీడియా అయితే తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఎవరో ఒక్క వ్యక్తి చేసిన పనికి భారత అభిమానులు మొత్తం బాధపడుతున్నారని ఆస్ట్రేలియా యువ బౌలర్ జంపా తెలిపాడు.

తాను హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నప్పుడు ఒక్కసారిగా అలజడి నెలకొంది. బస్సుపై ఎవరో రాయి విసిరారు అని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇక్కడి అభిమానులంటే మాకు చాలా ఇష్టం. క్రికెట్ ని ఇక్కడి వారు ఎంతో అభిమానిస్తారు. వారికి మేమంటే చాలా ఇష్టం. అందుకే ఇండియాలో ఆడబోతున్నామంటే మేము ఎంతో సంతోషిస్తామని జంపా వివరిస్తూ.. ఒక్కరి వల్ల ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారని జంపా తెలిపాడు. అయితే దాడి తర్వాత చాలామంది అభిమానులు గువాహటిలో బుధవారం పలు చోట్ల ‘సారీ ఆస్ట్రేలియా’ అని వారి తరహాలో చెప్పారు.

Comments