ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

ఆ మ్యాచ్ తరువాత ఆశిష్ నెహ్రా రిటైర్మెంట్ !


2003 ప్రపంచకప్.. లీగ్ దశలో కుదురుకునేందుకు టీం ఇండియ ఆపసోపాలు పడుతోంది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ భారత జట్టుకు కీలకమైనది. 50 ఓవర్లలో టీం ఇండియా 250 పరవాలేదనిపించే పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ జట్టు 168 పరుగులకు ఆల్ అవుట్. కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన 6/23 తో ఆశిష్ నెహ్రా టీం ఇండియా కు అద్భుత విజయాన్ని అందించాడు. నిప్పులు చెరిగే బంతులని విసిరిన నెహ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్ మాన్ లని ముప్పు తిప్పలు పెట్టాడు. ఫలితంగా టీం ఇండియా కు ఆత్మవిశ్వాసం పెపొందించే విజయం దక్కింది.

తన బౌలింగ్ నైపుణ్యం తో దశాబ్దానికి పైగా నెహ్రా టీమ్ ఇండియాకు సేవలిందించాడు. కాగా ఈ మీడియం పేసర్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో టీం ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య టి 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం నెహ్రా క్రికెట్ కు వీడ్కోలు పలకనునట్లు వార్తలు వస్తున్నాయి.

Comments