ముఖ్యమంత్రి కారే గోవిందా..దొంగలెత్తుకెళ్లారు..!!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు అపహరణకు గురైంది. దొంగలెత్తుకుపోయిన ఆ కారు కేజ్రీవాల్ సొంత వాహనం. సెక్రటేరియట్ వద్ద పార్క్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారుని దొంగిలించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీస్ లు రాగం లోకి దిగారు. ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెక్రటేరియట్ వద్ద ఉన్న అన్ని సిసి టివి ఫుటేజ్ లని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నీలిరంగులో ఉండే ఆ వేగనార్ కారు కేజ్రీవాల్ కు ఎంతో ప్రత్యేకమైనది. ఉద్యమకారుడిగా మారిన సమయం నుంచి కేజ్రీవాల్ ఆ కారునే ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ వాహనాల్ని ఆయన తిరస్కరించి సొంత కారునే ఉపయోగించడం విశేషం. యూకే కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుందన్ శర్మ ఈ కారుని కేజ్రీవాల్ కు బహుమతిగా ఇచ్చాడు.

Comments