పోలీస్ భార్య వారిని నమ్మి నగ్నంగా..!

క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలు వంటి వాటిని నమ్మే అమాయకులు ఇంకా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు మహిళలను ఓ పురుషుడు, మహిళా క్షుద్రపూజల పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ రురల్ జిల్లా వర్ధన్న పేటలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చేసిన ఐదుగురు మహిళలకు సంతానం కలగక పోవడంతో వారిని నమ్మేశారు.

పర్వతగిరి చెందిన ఓ మహిళ ఆ ఐదుగురి బలహీనతను వాడుకుంది. సంతానం కలిగించే శక్తులు తమ వద్ద ఉన్నాయని వారిని నమ్మించింది. దీనితో ఊరి శివార్లలో పూజలు నిర్వహించాలని వారిని తీసుకుని వెళ్ళింది. ఆ మహిళలందరిచే ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా మంత్రాలు చదివించింది. ఈ వ్యవహారం పోలీస్ లకు తెలియడంతో అక్కడికి చేరుకొని ఆ మహిళని అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళతో పేరు మరో పురుషుడు కూడా అక్కడ ఉండడం విశేషం. బాధితులైన ఐదుగురు మహిళల్లో ఓ యువతి భర్త జైళ్ల శాఖల్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పోలీస్ లు ఆ మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Comments