ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

శ్రీలంక మాజీ ఆటగాడు ఉచిత సలహాలు! కోహ్లికి మాత్రమె!

శ్రీలంక మాజీ ఆటగాడు, కెప్టెన్ గా శ్రీలంక టీంని నడిపించిన వ్యక్తి అర్జున్ రణతుంగ. ఈ పేరు క్రికెట్ హిస్టరీలో అందరికి భాగా తెలుసు. అయితే ఈ మాజీ ఆటగాడు ఈ మధ్య కాలంలో కాస్తా ఎక్కువగా మాట్లాడుతూ టాక్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని టీం ఇండియా మీద ఆరోపణలు చేసిన ఈ ఘనాపాటి ఇప్పుడు కోహ్లికి అడక్కుండానే ఉచిత సలహా ఇస్తున్నాడు. ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్న విరాట్ కోహ్లీ, ఇంకా కెప్టెన్ గా మాత్రం నిరూపించుకోలేదని రణతుంగ తన అభిప్రాయం చెప్పారు. కెప్టెన్ గా తన స్థాయికి తగ్గ ప్రదర్శన అతను కనబరచడం లేదని, కెప్టెన్ గా నిరూపించుకునేందుకు మరింతగా కష్టపడాలని ఉచిత సలహా ఇచ్చారు. ప్రతి చిన్న విషయానికి కోహ్లీ ఆగ్రహాన్ని చూపాల్సిన అవసరం లేదని, పదే పదే కోపాన్ని చూపడం వల్ల జట్టు ప్రదర్శన గాడి తప్పుడోందని హితవు పలికారు. టీం ఇండియాలో ధోనీ, అజార్ లు గొప్ప కెప్టెన్స్ అని వాళ్ళతో పోల్చెంత గొప్పతనం కోహ్లీకి ఇంకా రాలేదని అన్నాడు. మొత్తానికి అర్జున్ గారు ఇచ్చిన ఉచిత సలహా ఎట్టిదనిన. నీటిలో ఆకాశం కనిపిస్తుంది అని అందుకోవడానికి క్రింది దూకినట్లు ఉంది.

Comments