ఐఫోన్ ఎక్స్ ఇదే కొత్త మోడల్ పేరు… లీకైన ఐఓఎస్ కోడ్!


ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉత్పత్తులలో ఐఫోన్ కి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. ఆ కంపెనీ నుంచి ప్రతి ఏడాది ఒక కొత్త ఫీచర్ ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది. ఇప్పటికే ఐ ఫోన్ బ్రాండ్ నుంచి ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7ఎస్ వరకు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఐఫోన్ సాఫ్ట్ వేర్ కోడింగ్ చాలా భద్రం అని ఇన్ని రోజులు అందరు అనుకుంటున్నారు. కాని మొదటి సారి కొత్తగా రాబోతున్న ఐఫోన్ ఎక్స్ ఐఓఎస్ కోడ్ లీకైంది. ఈ కోడ్ ఆధారంగా ఐ ఫోన్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మోడల్ ఏంటి అన్న విషయాలు కూడా స్పష్టంగా తెలిసిపోయినట్లు సమాచారం. తాజాగా మరో కొద్ది రోజుల్లో ఐ ఫోన్ నుంచి రానున్న కొత్త ఫీచర్ ఫోన్ పేరు అనౌన్స్ చేస్తామని చేస్తారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇంతలో దాని ఓఎస్ కి సంబదించిన కోడ్ లీక్ అవడంపై కాస్తా ఆందోళనకరంగా ఉన్నారు. అయితే ఈ కోడ్ లో కరెక్ట్ ఎంత అనేది మాత్రం క్లేరిటి లేదు. త్వరలో ఐ ఫోన్ నుంచి లేటెస్ట్ వెర్షన్ గా ఐఫోన్ ఎక్స్ తో పాటు, ఐఫోన్ 8, ఐఫోన్ 8ఎస్ మార్కెట్ లోకి తెస్తున్న విషయం తెలిసిందే మరి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన ఈ ఐఫోన్ ఎక్స్ ఐఓఎస్ కోడ్ పై ఆ సంస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది చూడాలి.

Comments