ప్రచురణ తేదీ : Nov 9, 2017 8:25 AM IST

జగన్ లిప్ లాక్స్ కి జనం బయపడుతున్నారు.. మంత్రి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఎదురుగా వచ్చిన వారిని పలకరిస్తూ.. నవ్వుతూ ముందుకు సాగుతున్నారు. మొదటి రోజు భారీ స్థాయిలో ప్రారంభించినా కూడా రెండవరోజు నుంచి కొంచెం స్టామినా తగ్గింది అనేలా అధికార నేతలు కమేంట్స్ చేస్తున్నారు. జగన్ యాత్రపై ఎప్పటికప్పుడు వైసిపి నేతలు సోషల్ మీడియాలో న్యూస్ ఛానెల్స్ లో అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు.

యాత్రలో జగన్ ఎక్కువగా టిడిపి లోపాలను గుర్తు చేస్తూ తన మ్యానిఫెస్టో గురించి వివరిస్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఆంద్రప్రదేశ్ మంత్రి జవహర్ కూడా జగన్ ప్రజా సంకల్ప యాత్రపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించారు.

జగన్ ఎక్కడ ముద్దులు పెడతాడో అని జనం బయపడి పారిపోతున్నారని కామెంట్ చేశారు. అదే విధంగా కేవలం జగన్ అధికారాన్ని దక్కించుకోవడానికే యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైసిపి చాలా వరకు ఖాళీ అయిపోయిందని ఈ యాత్ర తరువాత మొత్తానికి క్లోజ్ అవుతాయని జవహర్ రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

Comments