క్రైమ్ స్టోరీ : నయీమ్.. అక్క మొగుడిని కూడా వదల్లేదు..


నయీమ్ నేర చరిత్ర గురించి ఎంత తెలుసుకుంటున్న ఇంకా ఎదో ఒక విషయం వెలువడుతూనే ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాఫియా డాన్ గా పేరుగాంచిన నయీమ్ ఎట్టకేలకు గత ఏడాది పోలీసుల చేతులో చనిపోయిన సంగతి తెలిసిందే.. అయితే అతను చనిపోయి ఏడాది పూర్తి కావొస్తున్నా ఎన్ని నేరాలు చేశాడో కరెక్ట్ గా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అయితే నయీమ్ గురించి రీసెంట్ గా వెలువడిన ఓ సమాచారం ప్రకారం అతను ఎంత కనికరం లేని నేరగాడో అర్ధమవుతోంది.

ఇటీవల కోర్టులో లొంగిపోయిన నయీమ్ మేన కోడలు ఆమె భర్తని విచారించిన పోలీసులు ఓ ఘటనకు సంబందించిన విషయాన్ని బయటపెట్టారు. 2013లో శంషాబాద్ లోని ఓ మారుమూల గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతంలో పోలీసులకు సగం కాలిన శవం దొరికింది. అయితే ఆ శవం విజయ్ కుమార అలియాస్ నదీమ్ గా గుర్తించారు. అతను ఎవరో కాదు. ప్రేమ కోసం మతాన్ని మార్చుకొని మరీ నయీమ్ అక్కను వివాహం చేసుకున్నాడు. ఎందుకో ఆ కేసు కొన్ని రోజులు హడావుడి చేసిన ఆ తర్వాత అందరు మర్చిపోయారు.

ఇక అసలు విషయంలోకి వెళితే నయీమ్ డాన్ గా ఎదుగుతున్న సమయంలో తన సిస్టర్ తో నదీమ్ కొట్లాడడం నచ్చలేదు. నయీమ్ సోదరి కూడా భర్తతో కోపంగానే ఉండేది. అయితే ఓ రోజు వారి సంసారం గొడవ పెద్దది కావడంతో నయీమ్ తన సెటిల్ మెంట్ తరహాలో బావను పిలిపించాడు. మొదట మాటలతో సెట్ చేద్దాం అనుకున్నారట కానీ నయీమ్ కి కోపం తెప్పించేలా నదీమ్ ప్రవర్తించడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. నయీమ్ తల్లి అల్లుడిని చంపేయాలని ఆర్డర్ వేసింది.

ఎందుకంటే అతను మన పర్సనల్ విషయాలను బయటపెట్టవచ్చు అని చెప్పడంతో నయీమ్ చున్నితో అతని ప్రాణపోయేవరకు అతిరాక్షసంగా చంపేశాడు. కుటుంబ సభ్యులందరు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో నయీమ్ మేన కోడలు కూడా ఉందట. నయీమ్ శవాన్ని కారులో వేసుకొని అడవిప్రాంతంలో కాల్చివెయ్యాలని అనుచరులకు చెప్పాడు కానీ శవం సగమే కాలడంతో పోలీసుల అనుమానాలు నిజమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నయీమ్ మరియు అతని కుటుంబ సభ్యులు ఎంతటివారో అని కామెంట్స్ చేస్తున్నారు.

Comments