ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

జగన్ ని ముసురుతున్న మరో అవినీతి కుంభకోణం..!

jagan
వైసిపి అధినేత పై ఇప్పటికే పలు అక్రమాస్తుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులను ప్రస్తుతం ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా జగన్, మాయావతి ల కేంద్రంగా మరో అవినీతి ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ చేపట్టినఇన్వెస్టిగేషన్ లో పలు విషయాలు బయట పడ్డాయి.

జగన్ మరియు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి బందువులకు సంబదించిన పలు సూట్కేస్ కంపెనీలను బయటపెట్టింది.ఈ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆ వార్తా సంస్థ ఆరోపిస్తోంది. గత ఏడేళ్లలో రూ 1316 కోట్ల మని లాండరింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.మాయావతి సోదరుడు , జగన్ మరియు మరికొందరు సూట్కేస్ కంపెనీలను సృష్టించి మని లాండరింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.

Comments