ప్రచురణ తేదీ : Dec 5, 2017 5:35 PM IST

నా దగ్గర డబ్బులు లేవు : డేరా బాబా దత్త పుత్రిక

గత కొన్ని నెలల క్రితం డేరా బాబా వివాదం ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన బాబా గారి రాసలీలలు చాలానే బయటపడ్డాయి. అంతే కాకుండా పంచకుల అల్లర్లతో అతను ఎంత రాక్షసుడో కూడా తెలిసింది. కేసు ముందుకు సాగుతున్న కొద్దీ అతను చేసిన దారుణలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. పోలీసులే ఆశ్చర్యపోతున్నారంటే డేరా ఎంత నీచుడో అర్ధం చేసుకోవచ్చు. అయితే అతని దత్త పుత్రిక హానిప్రీత్ దాదాపు నెల రోజుల పాటు అజ్ఞాతం లో ఉంది ఫైనల్ గా అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే.

పంచకుల అల్లర్ల కేసులో ఆమెనే అసలు నిందితురాలు అనే ఆరోపణలు ఉన్నాయి. గొడవలకు ఆమె దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం కేసు ఇంకా విచారణ దశలో ఉంది. అయితే ఆమె తరపున వాదించడానికి లాయర్లను ఏర్పాటు చేసుకున్నా వారికి ఫీజును చెల్లించడానికి కూడా డబ్బులు లేవని హాని ప్రీత్ చెబుతోంది. హాని ప్రీత్ తప్పించుకోగానే పోలీసులు ఆమె బ్యాంక్ ఎకౌంట్స్ అన్నిటిని సీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఎకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది.

Comments