సీఎంకు హజారే చివాట్లు!

anna-hazare-fires-on-chandr
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సామాజిక ఉద్యమనేత అన్నా హజారే లేఖ రాసారు. ఈ సందర్భంగా హజారే రాజధాని పేరుతో రైతుల నుండి సాగు భూముని సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వ తీరుపై తన లేఖలో సుతిమెత్తగా చివాట్లు పెట్టారు. ఇక ఏడాదికి రెండు, మూడు పంటలిచ్చే బంగారం లాంటి భూముల్లో రాజధాని నగరాన్ని నిర్మిస్తాననడం సరికాదని హజారే సూచించారు. అలాగే త్వరలో అమరావతిలో పర్యటించి అక్కడ రైతులు, కూలీలతో భేటీ అవుతానని హజారే తన లేఖలో తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసిన సామాజిక ఉద్యమకారులంతా ప్రభుత్వం రైతులను భయపెట్టి బంగారం లాంటి పంటలనిచ్చే భూములను రాజధాని కోసం సేకరించారని చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒకవేళ అదే గనుక నిజమైతే సేకరించిన భూములను వెంటనే రైతులకు ఇచ్చివేయాలని హజారే సూచించారు. ఇక అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించ వద్దంటూ హజారే తన లేఖలో చంద్రబాబుకు విజ్ఞ్యప్తి చేశారు.

Comments