ప్రచురణ తేదీ : Sun, Aug 13th, 2017

పవన్ కళ్యాణ్ … సమస్యలు కేవలం ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా!


పలు మీడియా సంస్థలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్వచ్చంద సంస్థల తరుపున పనిచేసే డాక్టర్ల బృందం కృషి చేయడం వలన ఉద్దానం కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ దీనిపై గట్టిగా రానా వాయిస్ వినిపించడం తో ప్రభుత్వం లో దీనిపై కాస్తైనా కదలిక వచ్చింది. ఉద్దానం కిడ్నీ భాదితులకు ఫించన్ లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. పవన్ చొరవతో హార్వర్డ్ డాక్టర్ల బృందం ఇటీవలే ఉద్దానంలో పరిస్థితులను అధ్యయనం చేసింది. ఉద్దానం పేరు ప్రస్తుతం మీడియాలో బాగా ప్రచారం పొందుతోంది. కానీ తెలంగాణాలో కూడా ఇలాంటి సమస్య ఉందని తెలుసా ? తెలంగాణ లోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని లంబాడి తండాలు కిడ్నీ వ్యాధులతో భాదపడుతున్న విషయం ఎంతమందికి తెలుసు ? ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందా ?వివరాల్లోకి వెళదాం.

జిల్లాకు చెందిన ఫ్యూల్ సింగ్ నాయక్ తండాలోని ప్రజలు గత కొన్ని ఏళ్లుగా మరణిస్తున్నారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన సమాచారం లో జిల్లా హెల్త్ ఆఫీసర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ మరణాలు ఇటీవలే సంభవించడంతో జిల్లా యంత్రంగం ఇప్పుడే మేల్కొంది. కిడ్నీ సమస్య ఆ ప్రాంతం లో ఇటీవలే మొదలైందా లేక ఎల్లా తరబడి ఉందా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి జిలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత 15 ఏళ్లలో ఆ ప్రాంతాల్లో సంభవించిన మరణాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ విషయం ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మా రెడ్డివరకూ కూడా చేరింది. దీనితో నిమ్స్ ఆసుపత్రి వైద్యులను కూడా ఆ ప్రాంతం లో అధ్యయనం చేయడానికి పంపినట్లు సమాచారం. ఆప్రాంతం లోనికి 125 మంది స్త్రీ మరియు పురుషులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి కిడ్నీ సమస్య పై అధ్యయనం చేయనున్నారు.

ఇలాంటి నామ మాత్ర చర్యలు ఉద్దానంలో కూడా గతంలో జరిగాయి. కానీ వాటి వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో సమస్యని పరిష్కరించడానికి అడుగు పడింది మాత్రం జనసేనాని దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తరువాతే.ఏపీ కేంద్రంగానే తన వాయిస్ ని వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణలోని ఈ ప్రాంతం గురించి తెలియదా ? ఎవరో ఒక సెలెబ్రిటీ, లేదా ప్రతిపక్షాలు ఇలాంటి అంశాలని హైలైట్ చేసి మీడియా గగ్గోలు పెడితే తప్ప ప్రభుత్వంలో సరైన కదలిక రాదు.

Comments