2019 ఎన్నికలపై అమిత్ షా షాకింగ్ కామెంట్స్!


ఎన్డీయే ప్రభుత్వంలోని బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, అంతేకాదు మోడీని మరొక్కమారు వారు ప్రధానిగా చూడాలనుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అంతేకాదు రానున్న 2019 లోక్ సభకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం తధ్యమని, తమకు అదివరకు దక్కని 80 స్థానాల్లో చాలావరకు ఈసారి కైవశం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళలో ఇదివరకటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతామని అన్నారు. మరోవైపు మహారాష్ట్రలో శివసేనను తమతో కలసిరావాలని ఉద్దవ్ థాక్రేను ఆహ్వానిస్తామని, వారు మాతో కలిసివస్తే మరింత లాభమని, ఒకవేళ రాకపోయినా తమకు పెద్దగా నష్టమేమి ఉండదని స్పష్టం చేశారు.

అలానే రానున్న ఎన్నికల్లో రాయ్ బరేలి, అమెధీల్లో ఏదొక నియోజకవర్గాన్ని తప్పక గెలుస్తామని అన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలుకానుక జరిగితే దేశంలోని 274 స్థానాలతో మోడీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారం చేపడుతుందని చెప్పారు. ఇక రాజస్థాన్ బిజెపి కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఈ నెల 26తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. అలానే ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన అమిత్ షా, ఏపీ తమకు ముఖ్యమై రాష్ట్రాల్లో ఒకటని, నిజానికి అక్కడి అధికార టీడీపీ తో ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్న సమయంలో ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేర్చామని, రానున్న ఎన్నికల్లో కూడా అక్కడి ప్రజలు తమకు మంచి మెజారిటీ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే మోడీ నేతృత్వం ప్రవేశ పెట్టిన పధకాలు బడుగు, బలహీన వర్గాలకు చాలా వరకు చేరాయని, తమ ప్రభుత్వం చేసిన అబివృద్ది, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్షగా నిలిచి మళ్ళి అధికారాన్ని పొందేలా చేస్తాయని అన్నారు. ఇక రాహుల్ గాంధీని పూర్తిగా పరిపక్వము చెందని నేతగానే దేశ ప్రజల్లో అధికులు గుర్తిస్తున్నారని, ఆయనకు పరిపాలన అంశాలపై అవగాహనా రావడానికి మరింత సమయం పడుతుందని, లేకపోతే దేశంలో ప్రధాని మోడీ తనవంతు అభివృద్ధిని చేస్తుంటే, బీజేపీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది అని చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు……

Comments