ప్రచురణ తేదీ : Dec 30, 2016 8:27 AM IST

తండ్రికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కొడుకు

akhilesh
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన తండ్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అయిన ములాయం సింగ్ యాదవ్ కి పెద్ద షాక్ ఇచ్చారు. త్వరలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 403 అస్సేబ్లీ స్థానాలకు గాను 325 మంది అభ్యర్థులను ములాయం నిన్న ప్రకటించారు. అయితే నిన్న ములాయం ప్రకటించిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు. వీరు అందరు అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు కావడం విశేషం.

ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ తన తండ్రికి పోటీగా 235 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు. తన మద్దతు దారులకు టిక్కెట్లు నిరాకరించిన కారణంగా తన జాబితా తానే ప్రకటించుకున్నారు. అఖిలేష్ ప్రకటించిన జాబితాలో మొత్తం 171 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 64 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. దీంతో సమాజ్ వాది పార్టీ లో అంతర్గత పోరు పూర్తిగా బయటపడింది. నేరుగా తండ్రినే ఢీ కొడుతున్న తీరు పార్టీకి చేటు చేస్తుందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. అభిలేష్ తన స్వంత జాబితా విడుదల చేయడం ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపుతోంది. అఖిలేష్ పై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.

Comments