ప్రచురణ తేదీ : Mon, Mar 20th, 2017

మ‌ళ్లీ మెగా హీరో జోలికొచ్చిన వ‌ర్మ‌!!


ఖైదీనంబ‌ర్ 150 ` ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా నాగబాబు .. రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు చీవాట్లు పెట్టారు. ఆ దెబ్బ‌కు వ‌ర్మ నోట మాట ప‌డిపోయింది. నాగ‌బాబు ఫీల‌యిన‌ట్టున్నారు! అన్న ఒక్క మాట త‌ప్ప ఇంకేదీ మాట్లాడ‌లేదు. మెగాబ్ర‌ద‌ర్ ఫైరింగుకి బెంబేలెత్తిన వ‌ర్మ గ‌త కొంత కాలంగా మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌, సామాజిక మాధ్య‌మాల్లో మెగా ఫ్యామిలీ జోలికెళ్ల‌లేదు. మెగా ఫ్యామిలీ, వాళ్ల ఫ్యాన్స్‌ జోలికి రానని ట్విట్టర్‌ సాక్షిగా వ‌ర్మ ప్ర‌క‌టించినా.. మాట త‌ప్ప‌డం అన్న అల‌వాటున్న వ‌ర్మ మ‌రోసారి మాట త‌ప్పాడు. ఈసారి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేసి పిచ్చి కూత‌లు కూశాడు.

ప‌వ‌న్ స్వ‌త‌హాగానే ప‌చ్చ‌ద‌నానికి ప్రియుడు. అది అత‌డి సినిమాల ద్వారా చూపించాడు కూడా. ఇటీవ‌ల `నాకు మొక్కలంటే ప్రేమ..` అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కి ప్ర‌తిట్వీట్‌గా వర్మ కొన్ని కామెంట్లు పెట్టాడు. పవన్ కళ్యాణ్ దేవుడని నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో పెట్టాలని వర్మ కామెంట్ చేశాడు. `అతడు దేవుడని నేను ఎల్లప్పుడు నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను పవన్‌తో భర్తీ చేయాలి“ అనీ అన్నాడు. ఈ ట్వీట్ మ‌రోసారి పిచ్చికూత‌లానే మెగా హీరోలు రిసీవ్ చేసుకున్నార‌ని తెలిసింది. మ‌రి వీటికి ప‌వ‌న్ స్పందిస్తారా? లేదా? అన్న‌ది చెప్ప‌లేం. మ‌రోసారి నాగ‌బాబు లైన్‌లోకొస్తారేమో?

Comments