ప్రచురణ తేదీ : Mon, Sep 11th, 2017

వీడియో : రివేంజ్ అంటే ఇది..స్లెడ్జింగ్ చేసిన బౌలర్ కు చుక్కలు కనిపించాయి..!


క్రికెట్ క్రీడ జెంటిల్ మెన్ గేమ్. కానీ ఇటీవల కాలంలో క్రికెట్ ఆటగాళ్లు అందుకు భిన్నంగా మైదానంలో దూకుడు స్వభావాన్ని చూపిస్తున్నారు. ఆటగాళ్లు ఒకరినొకరు స్లెడ్జింగ్ పేరుతో రెచ్చగొట్టుకోవడం క్రికెట్ లో ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలాంటి తరహా సంఘటనలు, భారత్ – పాక్, భారత్ – ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య చూస్తుంటాం. స్లెడ్జింగ్ పేరుతో ఆటగాళ్ళని రెచ్చ గొట్టి మ్యాచ్ కు ముందు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ఇప్పుడు వ్యహంగా మారిపోయింది. ఇలా తనని రెచ్చ గొట్టిన బౌలర్ కి సరిగ్గా బుద్ది చెప్పాడు కరేబియన్ బ్యాట్స్ మాన్.

మైదానంలోనే సాగిన వీరి మధ్య స్లెడ్జింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇటీవల జమైకా తల్హాస్ – అమెజాన్ వారియర్స్ మధ్య టి 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వాల్టన్ అనే ఆటగాడు విలియమ్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కానీ అతడు ఔటై పెవిలియన్ వెళుతున్న సమయం లో విలియమ్స్ అతడి వద్దకు వెళ్లి చేతిలో రాస్తూ ఇది గుర్తు పెట్టుకో అంటూ స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడు. కానీ మాల్టన్ మౌనంగానే వెళ్లిపోయాడు. ఆ రెండు జట్లు తలపడిన తదుపరి మ్యాచ్ లో వాల్టన్ చెలరేగి పోయాడు. ముఖ్యంగా అంటదు విలియమ్స్ బౌలింగ్ నే టార్గెట్ చేశాడు. అతడి బౌలింగ్ లో బౌండరీల మోత మోగించి చుక్కలు చూపించాడు. బంతిని బౌండరీకి తరలించిన ప్రతి సారి తన బ్యాట్ పై రాస్తూ విలియమ్స్ కు ధీటుగా బదులిచ్చాడు. ఈ మ్యాచ్ లో వాల్టన్ 40 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. వాల్టన్, విలియమ్స్ మధ్య రసవత్తర ఫైట్ ని మీరూ ఆస్వాదించండి..

Comments