ప్రచురణ తేదీ : Dec 5, 2017 9:12 PM IST

పందెం కోడి కూతకు బెదిరిపోయారు..నామినేషన్ వివాదంలో భారీ ట్విస్ట్ !

సినీ హీరో విశాల్ ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ వ్యవహారంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. పత్రాలు సరిగా లేవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశాల్ నామినేషన్ ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనితో విశాల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దే ధర్నాకు దిగడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. విశాల్ అరెస్టు, అనేక ఘటనల తరువాత అతడికి ఎన్నికల అధికారులనుంచి గుడ్ న్యూస్ వచ్చింది. పునః పరిశీలన తరువాత విశాల్ నామినేషన్ ని స్వీకరిస్తునట్లు అధికారులు ప్రకటించారు. దీనితో పందెం కోడి మళ్లీ బరిలో నిలిచినట్లైంది.

న్యాయం గెలిచిందని విశాల్ అన్నారు. విశాల్ తో పాటుగా దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరించారు. కానీ ఆమె నామినేషన్ ని అధికారులు పునః పరిశీలించలేదు. నామినేషన్ పత్రాల్లో పలు కాలమ్స్ ని ఆమె సరిగా నింపలేదని అధికారులు సాకు చెబుతున్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైందని తెలియగానే విశాల్ తన అనుచరులని వెంట బెట్టుకుని వెళ్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాడు. దీనితో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. అరెస్టు, పోలీస్ లతో వాగ్వాదంతో తరువాత అధికారులు విశాల్ నామినేషన్ ని స్వీకరిస్తునట్లు ప్రకటించారు.

Comments