ప్రచురణ తేదీ : Jan 30, 2017 12:19 PM IST

రాజీవ్ గాంధీ హత్యకు గురవుతారని 1986 లోనే చెప్పిన సిఐఎ

rajeev-gandhi
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగానే ఆయనఫై హత్యా యత్నాలు జరుగుతాయని… ఒకవేళ ఆయన పదవీ కాలానికి ముందే హత్యకు గురైతే.. తరువాత భారత్ పరిస్థితి ఏమిటి…? ఎవరు అధికారంలోకి వస్తారు…? ఇది ప్రపంచ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది…? ఈ విషయాలపై రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా ఉన్నపుడు… రాజీవ్ గాంధీ హత్యకు ఐదు సంవత్సరాల ముందు అంటే 1986 మార్చిలో అమెరికా నిఘా సంస్థ (సిఐఎ) ఒక రహస్య సమగ్ర నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఈ మధ్యే రహస్య జాబితా నుండి సిఐఎ తొలగించింది.

1986 జనవరి నాటికి తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం… ‘రాజీవ్ తరువాత భారత్’ పేరుతొ 23 పేజీల నివేదికను రూపొందించింది. అయితే ఈ నివేదికలో కొన్ని పేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని పేజీలు తొలగింపబడ్డాయి. ఈ నివేదికలో తొలి వాక్యంగా ‘1989 రాజీవ్ గాంధీ పదవీకాలం ముగిసేలోపు ఒక్కసారైనా ఆయనపై హత్యాయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని’ తెలిపింది. అది జరిగిన ఐదు సంవత్సరాల తరువాత 1991 మే 21న శ్రీపెరంబదూర్ లో ఎల్టీటీఈ సభ్యులు జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ మరణించారు. ఇంకా ఈ నివేదికలో రాజీవ్ తర్వాత ప్రధానిగా పీవీ నరసింహారావు కానీ, వీపీ సింగ్ కానీ ప్రధాని అవుతారని ఉంది. సిఐఎ అంచనా వేసినట్లుగానే రాజీవ్ హత్య తరువాత పీవీ నరసింహారావు ప్రధాని పదవిని చేపట్టారు.

Comments