తమ అభ్యర్థికి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని అభిమాని ఆత్మాహుతి..!

తెలంగాణాలో రాజకీయ సెగ ఇప్పుడు అభిమానులు కార్యకర్తల ఒంటికి కూడా అంటుకుంటుంది. ముందస్తు ఎన్నికల నిమిత్తం వారి పార్టీ యొక్క అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసినదే.. అయితే ఆ జాబితాలో తమ పేరు లేదని తీవ్ర మనస్తాపానికి గురి అయ్యిన అభ్యర్థులు కూడా కొంత మంది ఉన్నారు. వారిలో నల్లాల ఓదెలు గారు కూడా ఒకరు. కెసిఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేదని తెలిసి ఆయన తన ఇంట్లో తానే నిర్బందించుకున్నారు.

ఐతే తనని కాదని బాల్క సుమన్ కి ఆ టిక్కెట్టుని ఎలా ఇస్తారని వాపోయారు. అందులో భాగం గానే ఈ రోజు బాల్క సుమన్ వారి కార్యకర్తల చేత ప్రచార పనులకు మంచిర్యాల జిల్లా ఇందారం కి వెళ్లారు. ఐతే అక్కడికి చేరుకున్న ఓదెలు అనుచరులు వారి ప్రకటనను అడ్డుకొని అక్కడే బైఠాయించారు. వారి అభ్యర్థి అయ్యినటువంటి నల్లాల ఓదేలుని కాదని బాల్క సుమన్ కి టికెట్ ఎలా ఇస్తారని నిరసన చేపట్టారు.అంతలోనే ఓదెలు యొక్క అనుచరులలో ఒక వ్యక్తి అకస్మాతుగా తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఓదెలు గారికి టిక్కెట్టు ఇవ్వాలని నినదించారు. ఇదే ఘటనలో ఆయనతో పాటు ఉన్న ఇంకో ముగ్గురికి ఆ మంటలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు చర్యలు తీస్కొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐతే అక్కడ ప్రాణ నష్టం ఏమి జరగలేదని తెలిపారు క్షతగాత్రులని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Comments