యువతిని తన కోర్కె తీర్చమని బెదిరించి, జైలుపాలైన యువకుడు!

నేటి డిజిటల్ కాలంలో ఇంటర్నెట్ వినియోగం ప్రతిఒక్కరికి అవసరంగా మారింది. అది మనకు ఎంత ఉపయోగకరమో, అంతేలా నష్టకారి కూడా. నిజానికి ఒకప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి వినియోగించాలంటే ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లవలసి వచ్చేది. కానీ నేటిరోజుల్లో సెల్ ఫోన్ ధరలు, అలానే ఇంటర్ నెట్ ధరలు అందరికి అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువయింది. అయితే వీటిని ఉపయోగించుకుని కొందరు వికృత చేష్టలకు పాలపడం అక్కడక్కడా చూస్తున్నాం. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో అపరిచిత వ్యక్తులకు తమ ప్రైవేట్ సమాచారం బయటపెట్టకుండా దూరంగా ఉండాలని, ఎవరిని పడితే వారిని నమ్మవద్దని నిపుణులు ఎంత చెప్పినప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు.

అయితే ఫేస్బుక్ ద్వారా యువతిని పరిచయం చేసుకుని, తన కామ వాంఛ తీర్చమని బెదిరింపులకు గురిచేసి, బలవంతపెట్టి చివరికి కటకటాలపాలయిన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. పోలీస్ లు చెపుతున్న వివరాల ప్రకారం అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్‌ చదువుతున్న సాయికృష్ణ ఉమాపతి (25)కి, హైదరాబాద్ నగరంలో ఉంటూ ఓ ప్రభుత్వ సంస్థలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసే యువతి (23)కి మూడేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమ ఏర్పడింది. అనంతపురం మారుతినగర్‌లో ఉండే ఇతను తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. ఈక్రమంలో ఆమె కుటుంబసభ్యులతోనూ పరిచయం పెంచుకున్నాడు.

సదరు యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే రెండు నెలల కిందట ఆమెకు ప్రియుడు ఉన్నాడని తెలియడంతో తన కోరికతీర్చాలని బయటపెట్టాడు. గతంలో బాధితురాలు పంపిన చిత్రాలను మార్ఫింగ్‌ చేసి నగ్నంగా రూపొందించి సోషల్ మిడియాలో పెడతానని బెదిరించాడు. తన కోరిక తీర్చాలంటూ ఈనెల 10 వరకు గడువు విధించాడు. దీనిపై బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసిన నరేందర్‌గౌడ్‌ సాంకేతిక ఆధారాల్ని సేకరించి నిందితుడిపై నిఘా ఉంచారు.

యువతిని నేరగా కలిసి బెదిరించేందుకు ఉమాపతి హైదరాబాద్‌ వచ్చినట్లు సమాచారం అందడంతో మంగళవారం ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌లో అతన్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతడి నుంచి రెండు మొబైల్ ఫోన్ లను సీజ్‌ చేశారు. యువత, ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా లో క్రొత్తవారితో పరిచయాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఏసిపి అన్నారు…

తన కోరిక తీర్చకపోతే బాధితురాలి నగ్న చిత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించిన అతడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ వివరాల ప్రకారం..

Comments