ప్రచురణ తేదీ : Feb 16, 2017 5:29 PM IST

అతడి గుండెల్లో తూటా దించిన భగత్ సింగ్ తుపాకీ బయట పడింది..!


స్వాతంత్ర సమరంలో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలను అర్పించారు భగత్ సింగ్. ఆయన యూత్ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భగత్ సింగ్ జీవిత చరిత్ర కు సంబందించిన ఏ అంశమైనా యువతకు ఆసక్తి కరమే. స్వాతంత్ర సమరం లో భగత్ సింగ్ తొలిసారి బ్రిటిష్ అధికారి జాన్ శాండర్స్ ని కాల్చి చంపారు. భగత్ సింద్ యువకుడిగా ఉన్న సమయంలో బ్రిటిష్ అధికారిని చంపడం విశేషం. 1928 డిసెంబర్ 17 న భగత్ సింగ్ 168896 సీరియల్ నంబర్ కలిగిన 32 ఎంఎం కోల్డ్ ఆటోమేటిక్ పిస్టల్ తో శాండర్స్ ని కాల్చి చంపారు.

అప్పట్లో ఈ ఘటన బ్రిటిష్ వారు కలవర పడేలా చేసింది. ఆ తరువాత 1931 మర్చి 23న బ్రిటిష్ వారు భగత్ సింగ్ ని బంధించి ఉరి తీశారు. ఆ సమయంలో భగత్ సింగ్ వాడిన తుపాకీ బిఎస్ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపెన్ టాక్టిక్స్ లో ప్రదర్శనలో ఇప్పటికీ ఉంది. స్వాతంత్ర సమరంలో ఉపయోగించిన తుపాకీ గానే దానిని గుర్తించారు. కానీ భగత్ సింగ్ వాడిన తుపాకీ అని ఎవరికీ తెలియదు. కాగా ఇటీవల దీనిపై ఉన్న నలుపు రంగుని తొలగించి శుభ్రం చేసే క్రమంలో సీరియల్ నెంబర్ స్పష్టంగా కనిపించింది. సీరియల్ నెంబర్ ఆధారంగా భగత్ సింగ్.. బ్రిటిష్ అధికారి శాండర్స్ ని కాల్చి చంపిన తుపాకీ ఇదే అని నిర్ధారించారు.అంటే దాదాపు 90 ఏళ్ల తరువాత అది భగత్ సింగ్ తుపాకీ అని తేలడం విశేషం.

Comments