దాచేపల్లి ఘటన మరవకముందే మరో 8 ఏళ్ల చిన్నారిపై..

ఆడవారి సంరక్షణ కోసం ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 20 రోజుల వ్యవధిలోనే ఊహించని నాలుగు సంఘటనలు దేశ నలువైపులా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో లో ఒక ఘటన మరవకముందే మరొక అత్యాచారయత్నం ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం జరిపిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచార ప్రయత్నం జరుపుతుండగా బాలిక అతని నుంచి తప్పించుకొని పారిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి అక్కడే దేహ శుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments