ఉగ్రవాదుల చెర నుంచి 76 మంది బాలికలకు విముక్తి

ఫిబ్రవరిలో కిడ్నాప్ చేసిన బాలికలను బొకోహారం ఉగ్రవాదులు ఇవాళ విడుదల చేసి ఇళ్ళకు పంపించారు. ఈశాన్య డాప్సి పట్టణంలో బొకోహారం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినవారిలో 76 మంది బాలికలు సురక్షితంగా విడుదలయ్యారని సమాచార శాఖ మంత్రి లాయ్ మహ్మద్ వెల్లడించారు. బొకోహారం ఉగ్రవాదులు, నైజీరియన్ ప్రభుత్వానికి మధ్య చర్చలు సఫలం కావడంతో తీవ్రవాదులు బాలికలను విడిచిపెట్టారని తెలిపారు. కొంతమంది మిత్రుల సాయంతో కిడ్నాప్‌నకు గురైన బాలికలను సురక్షితంగా కాపాడామని పేర్కొన్నారు.

అయితే బొకోహారం తీవ్రవాదులు ఎవరికి అవకాశం ఇవ్వకుండా బాలికలను కిడ్నాప్ చేసిన స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారని కిడ్నాప్‌నకు గురైన బాలికల తల్లిదండ్రుల గ్రూప్‌నకు చెందిన వ్యక్తి ఒకరు తెలిపారు. బాలికలను తొమ్మిది వాహనాల్లో తీసుకువచ్చి స్కూల్ వద్ద వదిలి వెళ్లినట్లు తెలిపారు. నైజీరియాతోపాటు లేక్ ఛాడ్ ప్రాంతాల్లో బొకోహారం ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అవసరమైన నిధుల కోసం కిడ్నాప్‌ను అస్త్రంగా వాడుకొని ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడ్డారు.

మొత్తం 110 మంది బాలికలు కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నైజీరియా అధికారులు మాత్రం ఎంతమంది బాలికలు కిడ్నాప్‌నకు గురయ్యారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఎంత మంది బాలికలు ఆ ఉగ్రవాదుల చెరలో ఉన్నారన్నది మారటం తెలియలేదు.

Comments