షాకింగ్: పల్లె బాట పట్టనున్న ఐటీ ఉద్యోగులు? అంత దాని వల్లే!


ఇప్పటి వరకు ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానంలో భారతీయ ఐటీ నిపుణులు ఎన్నో అద్బుతాలు చేసారు. భారతదేశం అంటే ఐటీ రంగం. ఐటీ రంగం అంటే భారతదేశం అనేట్లు ప్రపంచ ద్రుష్టిలో నిలిచిపోయింది. దానికి తగ్గట్లు గానే ఇప్పుడు ప్రపంచంలో టాప్ 2 ఐటీ దిగ్గజ కంపెనీలకి సిఈఓలు మన ఇండియన్స్ ఉన్నారు. అలాగే చాలా కంపెనీలలో ప్రముఖ స్థానాల్లో మన భారతీయులు సత్తా చాటుతున్నారు. ఐటీ రంగంలో మేధో సంపద మొత్తం ఇండియా నుంచి ప్రపంచ దేశాలకి విస్తరించినదే. మన భారతీయులు తయారు చేయడంలో కాస్తా వెనక ఉన్న, కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకొని అందులో తమ మేధస్సుతో సత్తా చూపించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు.

ఐతే గత కొంత కాలంగా దేశీయ ఐటీ రంగ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. అలాగే ఇతర దేశాల్లో పని చేస్తున్న మన ఐటీ నిపుణులకి కూడా గడ్డుకాలం దాపురించింది. ఓ వైపు అమెరికా అద్యక్షుడు ట్రంప్ సంస్కరణలు, మరో వైపు సాంకేతిక విజ్ఞానంలో వస్తున్న మార్పులతో ఆటోమేషన్ టెక్నాలజీ మన ఉద్యోగాల్ల్లోకి ఎంటర్ అయిపోయి. ఉపాధి అవకాశాలని దూరం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా ఐటీ దిగ్గజ కంపెనీలు ఆటోమేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ, ఉద్యోగులని తగ్గించుకునేపనిలో పడ్డట్లు తెలుస్తుంది. తక్కువ నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులకి లక్షల జీతాలు ఇచ్చి పెంచే అవసరం లేకుండా అందరు ఆటోమేషన్ వైపు ద్రుష్టిపెడుతున్నట్లు ఓ అద్యయనంలో తేలింది.

2022 నాటికి భారత ఐటీ రంగంలో సుమారు 7 లక్షల ఉద్యోగాలకి ఆటోమేషన్ టెక్నాలజీ ఎసరు పెడుతుందని నివేదికలో పేర్కొన్నారు. దీనిని అమెరికాకి చెందిన హెచ్ఎఫ్ఎస్ అధ్యయనంలో చెప్పింది. ప్రాధమిక నైపుణ్యాలతో నడిచే ఉద్యోగులతో పాటు మధ్యస్థంగా నైపుణ్య ఉద్యోగాలు లక్ష, అధిక నైపుణ్య ఉద్యోగాలు ఆటోమేషన్ ఎఫెక్ట్ వలన గల్లంతవుతాయని అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ ఆటోమేషన్ ఎఫెక్ట్ అమెరికా, బ్రిటన్, భారత్ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, మిగిలిన దేశాల్లో స్వల్పంగా ఉంటుందని, నివేదికలో చెప్పారు. ఈ యాంత్రీకరణ ప్రభావం కేవలం ఒక 5 ఏళ్ళు మాత్రమె నియంత్రించగలమని తరువాత తన ప్రభావం చూపించడం మొదలుపెడుతుందని. అప్పటి నుంచి ఉద్యోగుల సంఖ్యా తగ్గుతూ వస్తుందని ఆ నివేదికలో చెప్పారు. ఒక్క సారిగా ఐటీ రంగ భవిష్యత్తు అగమ్యగోచరంలో పడటంతో మరల, అందరు పల్లెబాట పట్టి, సంప్రదాయ వృత్తుల మీద ద్రుష్టి పెట్టె అవకాశాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. యంత్రం కొట్టిన దెబ్బకి, ఐటీ ఉద్యోగులు అంత వేగగా కోలుకోవడం అంటే చాలా కష్టం.

Comments