ప్రచురణ తేదీ : Oct 24, 2017 4:51 PM IST

వీడియో : 400 గొర్రెల్ని గుద్దేసిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్..!


తెలంగాణాలో జరిగిన రైలు ప్రమాదంలో గొర్రెల రైతు కుటుంబం వీధిన పడింది. రైలు ఢీ కొనడంతో దాదాపు 400 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్న పేట రైల్వే ట్రాక్ వద్ద జరిగింది. గొర్రెల కాపరి మందని రైల్వే ట్రాక్ దాటిస్తుండగా ఒక్కసారిగా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ దూసుకుని వచ్చింది. దీనితో వందలాది గొర్రెలు మృతి చెందాయి.

గొర్రెల కాపరి ట్రాక్ వద్దే బోరున విలపించాడు. తన కుటుంబం వీధిన పడిందని, ఈ ప్రమాదం వలన తనకు దాదాపు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన చోట కనుచూపు మేర చనిపోయిన గొర్రెలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రభుత్వం తనని ఆదుకోవాలని గొర్రెల కాపరి విన్నవించుకున్నాడు. ఈ ఘటనని రైల్వే అధికారులు ధ్రువీకరించారు.

Comments