3నెలల్లో 4 వేల మందా? అసలు ఆ కంపెనీలో ఎం జరుగుతుంది?

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎన్నడూ లేని స్థాయిలో ప్రస్తుతం ఎదురైనా రెసిషన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి ప్రాణ సంకటంగా మారిపోతుంది. దీంతో ఇప్పుడు భద్రత లేని ఉద్యోగం చేస్తూ భయం భయం తో గడపడం కంటే వేరే ఉద్యోగం చూసుకోవడం బెటర్ అనే కోణంలో చాలా మంది ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. దీనికి నిదర్శనం అమెరికా కేంద్రంగా పని చేస్తున్నా, ఇండియాలో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధిని కల్పిస్తూ, ప్రముఖ ఐటీ సేవల సంస్థగా పేరు తెచ్చుకున్న కాగ్నిజెంట్ నుంచి గడచిన మూడు నెలల కాలంలో 4,400 మంది టెక్కీలు రాజీనామా చేసి వెళ్లడం. మార్చి నెలాఖరునాటికి 2.61 లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్ లో పని చేస్తుండగా, జూన్ చివరికి వారి సంఖ్య 2.56 లక్షలకు చేరింది. సాధారణ స్థాయికన్నా అట్రిషన్ లెవల్ తమ కంపెనీలో అధికంగా ఉందని అంగీకరించిన కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కరెన్ మెక్ లౌగ్లిన్, ఉద్యోగులంతా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశారని అన్నారు.

బీపీఓ, ట్రయినీ విభాగాల నుంచి అత్యధికులు వెళ్లిపోయారని, వార్షిక అట్రిషన్ రేటు 23.6 శాతంగా ఉందని ఆయన అన్నారు. వీరి రాజీనామా సంస్థ సేవలపై ఎటువంటి ప్రభావాన్నీ చూపబోదని, తమ డిజిటల్ బిజినెస్ నిరాటంకంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో అట్రిషన్ రేటు దిగివస్తుందని భావిస్తున్నామని తెలిపారు. అయితే కేవలం ఉద్యోగ భద్రత దృష్ట్యా చాలా మంది ఉద్యోగులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వాడులుకున్తున్నారని బయట వినిపిస్తున్న సమాచారం. ఒక్క కాగ్నోజేంట్ లోనే ఇంత మంది రాజీనామాలు చేస్తే మిగిలిన కంపెనీల పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Comments