11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు…

ప్రభుత్వం పై స్థాయిలో లేదన్న కోపమో లోక నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో లేమని బాధో తెలియదు కానీ నిన్న జరిగిన శాసన సభ బడ్జెట్ సభా సమావేశాలు కాంగ్రెస్ పార్టీ సభ్యుల కారణంగా నిరసనలు, నినాదాలతో పెను చిచ్చులు రేగాయి. మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై నిన్న అసెంబ్లీలో జరిగిన దాడిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శాసనసభాపతి మధుసూదనాచారి ఆగ్రహోపేత ఆలోచనతో సస్పెండ్‌ చేశారు. జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌లపై సస్పెన్షన్‌కాటు వేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలు రద్దు చేశారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ బహిష్కరణ ఉంటుందని స్పీకర్‌ ప్రకటించారు.

తదనంతరం సస్పెండైన సభ్యులు సభను వీడాలని స్పీకర్‌ ఆదేశించారు. మండలి ఛైర్మన్‌పై జరిగిన దాడి చూసి తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈ ఘటన ఓ మచ్చు తునకగా నిలిచిపోతుందని, అధికారంలో లేమన్న ఆగ్రహంతో రాష్ట్ర పరువు తీసారని అన్నారు. అంతకుముందు సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండించారు. సమావేశాలు ముగిసేవరకూ కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు కాదని మరేదైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీస్కోవాల్సి ఉంటుందని శాసనసభాపతి మధుసూదనాచారి వెల్లడించారు.

Comments