100 ఏళ్ల పరుగుల ధీరుడి షాకింగ్ రికార్డ్

ప్రస్తుత రోజుల్లో ఒక మనిషి 50 ఏళ్ల వరకు కూడా కరెక్ట్ గా బ్రతకడం లేదు. 70 ఏళ్ల వరకు బ్రతికాడంటే చాలా గొప్ప విషయం. అయితే ఇంకా అందరిని ఆశ్చర్యపరుస్తూ కొంత మంది 100 ఏళ్ల వరకు వారి జీవితాన్ని ఏ ఇబ్బంది లేకుండా గడుపుతున్నారు. అంతే కాకుండా ఆ వయసులో సాధ్యం కానీ పనులను చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓర్వీల్ రోజ‌ర్స్ డ‌ల్లాస్ ప్రాంతంలో ఇటీవల తన 100వ పుట్టినరోజును జరుపుకున్నాడు.

ఈ విషయంలో స్పెషల్ ఏమిటంటే.. అతను తన 100వ పుట్టినరోజు సందర్భంగా 100 మైళ్ల దూరం పరిగెత్తడు. పుట్టిన రోజు వేడుక కోసం తన నాలుగు త‌రాల కుటుంబ స‌భ్యుల‌ను పిలిపించి వారితో క‌లిసి ఆనందంగా వేడుక జరుపుకున్నాడు. రోజ‌ర్స్‌ 50 ఏళ్ల వ‌ర‌కు అసలు పరుగు గురించి పెద్దగా ఆలోచించలేదట. కానీ ‘ఎరోబిక్స్‌’ అనే పుస్తకం చదివిన తరువాత అతనిలో చాలా మార్పు వచ్చింది. పరుగు వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకొని అప్పటి నుంచి పరిగెత్తడం మొదలు పెడుతున్నాడు. అయితే రీసెంట్ గా 100వ పుట్టిన రోజుకు 100 మైళ్లు పరిగెత్తి ఈ వృద్ధ పరుగుల ధీరుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు.

Comments