ప్రచురణ తేదీ : Fri, Jan 6th, 2017

ధోనీ వెళ్లిపోతుంటే కోహ్లీ ఏమన్నాడు ?

dhoni and kohli
భారత్ క్రికెట్ కి వెన్ను ముక గా నిలిచిన కెప్టెన్ ధోనీ తన ఆఖరి మ్యాచ్ కూడా ఆడకుండా కెప్టెన్ గా రాజీనామా చేసేసాడు. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా. ట్విట్టర్ లో కాబోయే కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలి లో స్పందించాడు.తన ట్విట్టర్ లో భావోద్వేగంతో కూడిన ట్వీట్ పెడుతూ, “యువకులకు నిత్యమూ ఓ లీడర్ గా ఉండి వారిని నడిపించినందుకు కృతజ్ఞతలు. చుట్టూ యంగ్ స్టర్స్ ఉండాలని భావిస్తుంటావు. అన్నా ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే” అని ఈ ఉదయం 9:30 గంటల సమయంలో ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. కాగా, త్వరలో ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ గా ఆడనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్యా జనవరి 15న తొలి మ్యాచ్ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరగనుంది

Comments